దేశంలో కొత్త‌గా 1007 కేసులు

India Reports 1007 new covid 19 infections.దేశంలో గ‌డిచిన 24 గంటల్లో 4,34,877 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..1007

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2022 10:27 AM IST
దేశంలో కొత్త‌గా 1007 కేసులు

దేశంలో గ‌డిచిన 24 గంటల్లో 4,34,877 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..1007 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,39,023కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,21,737కి చేరింది.

ఒక్క రోజులో 818 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,06,228కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివ్ రేటు 0.23శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,86,22,76,304 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story