దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,29,798 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 38,667 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,56,493 చేరింది. నిన్న ఒక్క రోజే 478 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,30,732 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న35,743 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,13,38,088 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,87,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.45శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.05శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 63,80,937 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 53.61కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.