భారత్‌ కరోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

COVID19 అప్‌డేట్: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరగటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

By అంజి  Published on  12 April 2023 6:35 AM GMT
India,  COVID-19 cases, Corona

 భారత్‌ కరోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

COVID19 అప్‌డేట్: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరగటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దేశంలో గడిచిన 223 రోజులలో అత్యధికంగా 7,830 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు ఒక్కరోజులో పెరిగాయి. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఏడునెలల అత్యధికానికి చేరిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దాంతో రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది. తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 40వేల(0.09శాతం)కు చేరింది. రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. కేంద్రం 11 మరణాలను ప్రకటించగా.. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని డేటా తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story