భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 699 కొవిడ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2023 11:41 AM IST
India, COVID-19

క‌రోనా టెస్టులు ప్ర‌తీకాత్మ‌క చిత్రం


గ‌త కొద్ది రోజులుగా దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ కేంద్రం లేఖ రాసింది. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 699 కొవిడ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం వెల్ల‌డించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య(యాక్టివ్ కేసులు) 6,559కి చేరింది.

నిన్న క‌రోనాతో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. వీటిని క‌లుపుకుంటే క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,808కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 435 మంది వైరస్ నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,59,617 కు చేరుకుంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉండగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

కోవిడ్‌-19 నిర్ధారణ కోసం మొత్తం 92.04 కోట్ల పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 97,866 పరీక్షలు జరిగాయి. గడిచ‌న‌ 24 గంటల్లో మొత్తం 7,463 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు.

Next Story