COVID-19 : దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో మ‌రోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది.మొన్న‌టి వ‌ర‌కు వెయ్యిలోపు కేసులు మాత్ర‌మే న‌మోదు కాగా నేడు వెయ్యికి పైగా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2023 11:30 AM IST
India, COVID-19

క‌రోనా టెస్టు ప్ర‌తీకాత్మ‌క చిత్రం



దేశంలో మ‌రోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు వెయ్యిలోపు కేసులు మాత్ర‌మే న‌మోదు కాగా నేడు వెయ్యికి పైగా కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన బులెటిన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 1134 కొవిడ్‌-19 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య‌(యాక్టివ్ కేసులు) 7,026కి పెరిగాయి.

నిన్న ఢిల్లీ, కేర‌ళ‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్ గ‌డ్‌ల‌లో క‌రోనా కార‌ణంగా ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,30,813కి చేరింది. నిన్న 662 మంది క‌రోనాను జ‌యించ‌గా మొత్తంగా 4,41,60,279 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారి పాజిటివ్ రేటు 0.02శాతంగా ఉండ‌గా వీక్లీ పాజిటివ్ రేటు 0.98 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.19శాతంగా ఉంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 1,03,831క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1.92 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అంద‌జేశారు.

Next Story