భారత్ కరోనా అప్డేట్: 10 వేలు దాటిన కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
By అంజి Published on 13 April 2023 5:45 AM GMTభారత్ కరోనా అప్డేట్: 10 వేలు దాటిన కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గురువారం 10,158 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. నేడు 30 శాతం మేర కరోనా కేసులు పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. క్రియాశీల ఇన్ఫెక్షన్లు 44,998కి పెరిగాయి. బుధవారం. దేశంలో కోవిడ్ కేసులు 7,830 నమోదయ్యాయి, మంగళవారం మొత్తం 5,676 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,958 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,158 కొత్త కేసులు బయటపడ్డాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 98.71%కి పెరగడంతో ఇప్పటివరకు మొత్తం 4,42,10,127 మంది కోలుకున్నారు. 19 కొత్త మరణాలతో వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,035 కు పెరిగింది. మరణాల రేటు 1.19%గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. రోజూవారి పాజిటివిటీ రేటు ఏకంగా 4.42 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,24,653) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అయితే కేసుల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ఆటలు మరెన్నో రోజులు సాగవని, గరిష్ఠంగా మరో 12 రోజులపాటు వైరస్ ఉద్ధృతి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఎండ్‌మిక్ దశకు చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసుల ఉద్ధృతి మరో 12 రోజులపాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని అంటున్నారు.