భారత్‌లో కరోనా విజృంభణ.. 33 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు

భారతదేశంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. కొత్త వేరియంట్లతో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

By అంజి  Published on  9 April 2023 12:30 PM IST
Covid infections, Corona active cases, India

భారత్‌లో కరోనా విజృంభణ.. 33 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు

భారతదేశంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. కొత్త వేరియంట్లతో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 5,357 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 32,814కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. తాజాగా 11 మరణాలతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,965కి పెరిగింది. గుజరాత్ నుండి ముగ్గురు మరణాలు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర , ఒడిశా, ఉత్తరప్రదేశ్ నుండి ఒక్కొక్కరు మరణించారు.

ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లుగా నమోదైంది (4,47,56,616). క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.07 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,92,837కి చేరుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

Next Story