విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 5 రెట్లు పెరిగిన కేసులు
India covid-19 update on January 3rd.మరోసారి కరోనా మహమ్మారి దేశంలో పంజా విసురుతోంది. ఇక కరోనా కొత్త
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2022 10:32 AM IST
మరోసారి కరోనా మహమ్మారి దేశంలో పంజా విసురుతోంది. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు చెబుతుండడంతో పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం ఉదయానికి 1,700 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక నిన్న దేశ వ్యాప్తంగా 8,78,990 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 33,750 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,49,22,882కి చేరింది. నిన్న ఒక్క రోజే 123 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,81,893కి చేరింది. నిన్న 10,846 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,42,95,407కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.20 శాతంగా ఉంది.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1700కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 510 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 351 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేరళలో 156, గుజరాత్‌లో 136, తమిళనాడులో 121, రాజస్థాన్‌లో 120, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 639 మంది కోలుకున్నారు. నిన్న మందికి 23,30,706 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 1,45,68,89,304 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 68.09 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) January 3, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/wYaXyBZkmy pic.twitter.com/oXuK6xtFl3