దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా రోజువారి కేసుల సంఖ్య తగ్గుతుండగా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 17,59,434మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,35,532 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. నిన్న 871 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,93,198కి చేరింది.
ఒక్క రోజులో 3,83,60,710 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,83,60,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,04,333యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.89శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 13.39శాతంగా నమోదు అయింది. నిన్న 60,14,044 మందికి టీకా అందించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,04,87,260 కోట్ల డోసులను పంపిణీ చేశారు.