ఆగ‌ని క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Covid-19 update on January 27th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,62,261 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 9:41 AM IST
ఆగ‌ని క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,62,261 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,86,384 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య4,03,71,500కి చేరింది. నిన్న 573 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,91,700కి చేరింది.

ఒక్క రోజులో 3,06,357మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,76,77,328కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 22,02,472యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 93.33శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 19.59శాతంగా న‌మోదు అయింది. నిన్న 26 ల‌క్ష‌ల మందికి టీకా అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 163.84 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story