దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 19,35,912 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,47,254 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,85,66,027కి చేరింది. నిన్న 703 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,88,396కి చేరింది.
ఒక్క రోజులో 2,51,777 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,60,58,806కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.50శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 17.94శాతానికి పెరిగింది. ఇక శుక్రవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 160.43 కోట్ల డోసులను పంపిణీ చేశారు.