దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. దీంతో రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 19,35,180 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,17,532 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,18,773కి చేరింది. నిన్న 491 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,87,693కి చేరింది.
ఒక్క రోజులో 2,23,990 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,58,07,029కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,24,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.69శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 16.41శాతానికి పెరిగింది. ఇక గురువారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 9,287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న దాదాపు 80లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు 159.67 కోట్ల డోసులను పంపిణీ చేశారు.