భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India covid-19 update on February10th.దేశంలో క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2022 4:34 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 15,11,321 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 67,084 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. నిన్న1,241 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,06,520కి చేరింది.

ఒక్క రోజులో 1,67,882 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,11,80,751 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 7,90,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 96.95 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 4.44 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 41,13,242 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,71,28,19,947 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story