భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

India Covid 19 update on February 9th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 4:32 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో 15,71,726 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 71,365 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,10,976కి చేరింది. నిన్న1,217 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,05,279కి చేరింది.

ఒక్క రోజులో 1,72,211 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,10,12,869 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 8,92,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 96.70 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 4.54 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 65,34,090 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,70,87,06,705 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story