దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 13,46,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 67,597 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,23,39,611కి చేరింది. నిన్న1,188 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,04,062కి చేరింది.
ఒక్క రోజులో 1,80,456 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,08,40,658కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.46 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 5.02 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,70,21,72,615 డోసులను పంపిణీ చేశారు.