భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India covid-19 update on February 6th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 4:30 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 14,48,513 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,07,474 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కి చేరింది. నిన్న865 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,01,979కి చేరింది.

ఒక్క రోజులో 2,13,246 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,04,61,148కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 95.64 శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 7.42 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 48,09,498 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,69.46,26,697 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story