దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు కూడా రెండు లక్షల లోపు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,72,433 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,18,03,318కి చేరింది. నిన్న1,008 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,98,983కి చేరింది.
ఒక్క రోజులో 2,59,107 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,97,70,414కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,33,921యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.14శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 10.99 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 167.87కోట్ల డోసులను పంపిణీ చేశారు.