దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రెండు లక్షల లోపు కేసులు నమోదు అయ్యాయి. అయితే.. మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 17,42,793 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,61,386 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,16,30,885కి చేరింది. నిన్న1733 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,97,975కి చేరింది.
ఒక్క రోజులో 2,81,109 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,95,11,307కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,21,603యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 94.91శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 9.26 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 167.29 కోట్ల డోసులను పంపిణీ చేశారు.