దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 13 శాతం తగ్గింది. గడిచిన 24 గంటల్లో 14,50,532 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 50,407 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. నిన్న804 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,07,981కి చేరింది.
ఒక్క రోజులో 1,36,962 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,14,68,120కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,10,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 3.48 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 46 లక్షల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసులను పంపిణీ చేశారు.