భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 7 ల‌క్ష‌ల దిగువ‌కు యాక్టివ్ కేసులు

India covid-19 update on February 11th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2022 4:22 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 7 ల‌క్ష‌ల దిగువ‌కు యాక్టివ్ కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 58,077 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. నిన్న657 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,07,177కి చేరింది.

ఒక్క రోజులో 1,50,407 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,13,31,158కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 97.17 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 3.89 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 51,31,485 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,71,79,51,432 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story