భారత్ ఒమిక్రాన్ అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India Covid-19 update on December 26th.దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 4:46 AM GMTదేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79, గుజరాత్లో 43,తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్‌లో 22, పశ్చిమ బెంగాల్ 6, హర్యానాలో 4, ఒడిశాలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్ము కశ్మీర్లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, చండీఘర్‌లో 1, లద్దాఖ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 130 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 26, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/wKcrvJlQkb pic.twitter.com/IuE0DMXmkO
ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,45,455 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,86,802కి చేరింది. నిన్న ఒక్క రోజే 130 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కి చేరింది. నిన్న 7,091 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,42,30,354కి చేరింది. ప్రస్తుతం దేశంలో 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న36 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 141.37 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 67.19 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.