దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. కొత్తగా ఎన్నికేసులంటే
India covid-19 update on December 24th.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శర వేగంగా వ్యాప్తిచెందుతోంది.
By తోట వంశీ కుమార్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శర వేగంగా వ్యాప్తిచెందుతోంది. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 122 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్‌లో 30, కేరళలో 27, రాజస్థాన్‌లో 22, హర్యానాలో 4, ఒడిశాలో 4, జమ్ము కశ్మీర్‌లో 3, పశ్చిమ బెంగాల్ 3, ఆంధ్రప్రదేశ్‌లో 2, ఉత్తరప్రదేశ్‌లో 2, చండీఘర్‌లో 1, లద్దాఖ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో 114 మంది కోలుకున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,65,887 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,650 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,72,626కి చేరింది. నిన్న ఒక్క రోజే 374 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,133కి చేరింది. నిన్న 7,051 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,42,15,977కి చేరింది. ప్రస్తుతం దేశంలో 77,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 57.44 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 140.31కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 66.98 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 24, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/w7bTeypumG pic.twitter.com/LIBJ5kaemJ