దేశంలో కొత్తగా 6,317 కరోనా కేసులు.. 213కు పెరిగిన ఒమిక్రాన్‌ కేసులు

India Covid-19 update on December 22nd.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 10:25 AM IST
దేశంలో కొత్తగా 6,317 కరోనా కేసులు.. 213కు పెరిగిన ఒమిక్రాన్‌ కేసులు

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 213కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీ, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇందులో ఇప్పటి వరకు 90 మంది కోలుకున్నారని చెప్పింది.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 12,29,512 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 6,317 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,58,481కి చేరింది. నిన్న ఒక్క రోజే 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,78,325కి చేరింది.

నిన్న6,906 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,01,966కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 57 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 138.9 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66.74 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story