భారత్ కరోనా అప్‌డేట్.. పెరిగిన కేసులు
India covid-19 update on December 16th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 14 శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,16,011కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,984 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కి చేరింది. నిన్న ఒక్క రోజే 343 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,76,478కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 16, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/858SQyUN4J pic.twitter.com/KdBFpmSVYZ
నిన్న7,974 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,41,54,879కి చేరింది. ప్రస్తుతం దేశంలో 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.38 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న68,89,025 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 135.25 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 66.02 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.