భారత్ కరోనా అప్‌డేట్.. పెరిగిన కేసులు
India Covid 19 bulletin on September 30th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన
By తోట వంశీ కుమార్ Published on 30 Sep 2021 4:44 AM GMT
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య నేడు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 15,06,254 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 23,529 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980 చేరింది. నిన్న ఒక్క రోజే 311 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,48,062కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 30, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/Hlh1hqeYB0 pic.twitter.com/yZkEeUIKBA
నిన్న 28,718 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,30,14,898 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,77,020 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.85శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.74శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 65,34,306 మందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు 88,34,70,578 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.