భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,05,962 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 13,451 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కి చేరింది. నిన్న ఒక్క రోజే 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,55,653కి చేరింది. నిన్న 14021 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,35,97,339కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 55,89,124 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 1,03,53,25,577 టీకా డోసులను పంపిణీ చేశారు.