భారత్‌లో వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 11,57,697 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 9,283 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,35,763కి చేరింది. నిన్న ఒక్క రోజే 437 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,66,584కి చేరింది.
నిన్న 10,949 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,39,57,698కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.33 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 76,58,203 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,18,40,31,702 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.