భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 10,72,863 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,302 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,99,925కి చేరింది. నిన్న ఒక్క రోజే 267 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,65,349కి చేరింది.
నిన్న 11,787 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,39,09,708కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,24,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.29 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 51,59,931 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,15,79,69,274 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.