భారత్‌లో కరోనా విలయతాండవం.. లక్షదాటిన రోజువారి కేసులు
India corona update on January 7th.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 10:21 AM IST
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారి కేసులు లక్ష దాటేశాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 28.8 శాతం అధికంగా నమోదు అయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 15,13,377 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,17,100 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386 కి చేరింది. కొత్త కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర (36,265) తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (15,421), ఢిల్లీ (15,097), తమిళనాడు (6,983), కర్ణాటక (5,031) రాష్ట్రాలు ఉన్నాయి.
నిన్న ఒక్క రోజే 302 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,83,178కి చేరింది. నిన్న 30,836 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,43,71,845కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,007కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు ఈ మహమ్మారి బారిన పడగా.. ఆ తరువాత ఢిల్లీలో 465 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1,199మంది కోలుకున్నారు. నిన్న 94.4 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 149.66 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) January 7, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/FIvxNve8TT pic.twitter.com/HBMLLIvwd6