విజృంభిస్తున్న కరోనా.. 60వేలకు చేరువలో కొత్త కేసులు
India corona update on January 5th.దేశంలో కరోనా ఉద్దృతి రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రా
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2022 10:16 AM IST
దేశంలో కరోనా ఉద్దృతి రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో రోజువారి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 55 శాతం అధికంగా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న దేశవ్యాప్తంగా 13,88,647 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 58,097 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,50,18,358కి చేరింది. నిన్న ఒక్క రోజే 534 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న 15,389 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. బుధవారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 2135కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 653 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 464 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 154, తమిళనాడులో 121 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 828మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 147.72 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) January 5, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/goHUQl5cOY pic.twitter.com/6G2N9Y9q2k