భారత్ కరోనా అప్‌డేట్.. పెరుగుతున్న కేసులు
India Corona update on January 4th.గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు కరోనా
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 10:17 AM ISTగత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తుండగా.. మిగతా రాష్ట్రాలు కూడా ఆంక్షల బాట పడుతున్నాయి.
ఇక నిన్న దేశవ్యాప్తంగా 11,54,302 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 37,379 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,49,60,261కి చేరింది. నిన్న ఒక్క రోజే 124 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,82,017కి చేరింది. నిన్న 11,007 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,43,06,414కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. మంగళవారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1892కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 588 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 382 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిశాలో 37, పశ్చిమ బెంగాల్‌లో 20 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 766 మంది కోలుకున్నారు. నిన్న మందికి 1,01,29,160 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 1,46,70,18,464 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.