దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,15,993మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,10,92,522కి చేరింది. నిన్న 893 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,94,091కి చేరింది.
ఒక్క రోజులో 3,52,784 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,87,13,494కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,84,937యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 94.21శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 14.50శాతంగా నమోదు అయింది. నిన్న 65,73,432 మందికి టీకాలు ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,70,60,692 కోట్ల డోసులను పంపిణీ చేశారు.