భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India Corona update on January 22nd.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టి పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 4:43 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టి పోలిస్తే నేడు కేసుల సంఖ్య 2.7 శాతం త‌క్కువ‌గా న‌మోదు అయింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,60,954 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,37,704 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. నిన్న 488 మంది మ‌ర‌ణించారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,88,884కి చేరింది.

ఒక్క రోజులో 2,42,676 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 21,13,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 93.31శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 17.22శాతంగా న‌మోదు అయింది. ఇక శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న 67 ల‌క్ష‌ల మందికి టీకా అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 161.16 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story