కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India corona update on January 14th.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jan 2022 4:35 AM GMT
కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,64,202 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కి చేరింది. నిన్న ఒక్క రోజే 315 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 4,85,350కి చేరింది. ఒక్క రోజులో 1,09,345 మంది కోలుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,48,24,706కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 12,72,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటీవీ రేటు 14.78శాతంగా న‌మోదుకాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. శుక్ర‌వారం ఉద‌యానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 5,753 కి చేరింది. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, కేర‌ళ‌లో దీని ప్ర‌భావం అధికంగా ఉంది. నిన్న 73 ల‌క్ష‌ల‌ మందికి టీకా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 155.39 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story