భారత్ కరోనా అప్‌డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India corona update on December 20th.భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,77,055 కరోనా
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2021 4:49 AM GMTభారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,77,055 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,563 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,46,838కి చేరింది. నిన్న ఒక్క రోజే 132 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,77,554కి చేరింది.
నిన్న8,077 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,41,87,017కి చేరింది. ప్రస్తుతం దేశంలో 82,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.39 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 137.67 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 66.51 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 20, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/ePfVfanKHQ pic.twitter.com/7T81PESsEu
ఇక దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 153 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే 54 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణలో 20, కేరళలో 11, గుజరాత్‌లో 11 కేసులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.