దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,08,467 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,954 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కి చేరింది. నిన్న ఒక్క రోజే 267 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,69,247కి చేరింది. నిన్న10,207 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,28,506కి చేరింది.
ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 547 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 99,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 80,98,716 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,24,10,86,850 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.