దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,64,594 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,62,720 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4,136 మంది కరోనా కారణంగా మరణించారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఇక కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయినా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది. ఈ మహమ్మారి కోరల నుండి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఆలోచనలో ఉన్నారు.