భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,00,123 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 14,146 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,67,719కి చేరింది. నిన్న ఒక్క రోజే 144 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,52,124 కి చేరింది. నిన్న 19,788 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,34,19,749 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 220 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 41,20,772 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 97,65,89,540 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.