భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India corona bulletin on October 10th.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 4:11 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 12,83,212మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 18,166 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,39,53,475కి చేరింది. నిన్న ఒక్క రోజే 214 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,50,589 కి చేరింది.

నిన్న 23,624 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,32,71,915 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,30,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 208 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 97.99 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 94,70,10,175 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

Next Story
Share it