దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,68,514 మందికి కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 11,903 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కి చేరింది. నిన్న ఒక్క రోజే 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,59,191కి చేరింది.
నిన్న 14,159మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,36,97,740కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.22 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 41,16,230 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 107.29 కోట్ల డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.