దేశంలో కరోనా ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,09,045 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,423 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237కి చేరింది. నిన్న ఒక్క రోజే 443 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,58,880కి చేరింది.
నిన్న 15,021మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,36,83,581కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,53,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.21 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,06,85,71,879 కోట్ల డోసులను పంపిణీ చేశారు.