భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,42,177 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,197 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కి చేరింది. నిన్న ఒక్క రోజే 301 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,64,153కి చేరింది.
నిన్న 12,134 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,44,66,598కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,28,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.28 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 67,82,042 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,13,65,66,087 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు. తాజాగా నమోదైన మొత్తం కేసులో దాదాపు సగం అంటే 5,516 కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.