20 యూట్యూబ్ ఛాన‌ళ్లు, 2 వెబ్‌సైట్ల‌పై కేంద్ర‌ప్ర‌భుత్వం కొర‌డా .. ఎందుకంటే..

India blocks 20 YouTube Channels, 2 websites for spreading anti-India propaganda. ఇంటర్నెట్‌లో దేశంపై వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నందుకు

By Medi Samrat  Published on  21 Dec 2021 4:31 PM IST
20 యూట్యూబ్ ఛాన‌ళ్లు, 2 వెబ్‌సైట్ల‌పై కేంద్ర‌ప్ర‌భుత్వం కొర‌డా .. ఎందుకంటే..

ఇంటర్నెట్‌లో దేశంపై వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం 20 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. ఈ సంద‌ర్భంగా.. ఛానెల్‌లు పోస్ట్ చేసిన చాలా కంటెంట్ "జాతీయ భద్రత కోణం నుండి సున్నితమైన విషయాలకు సంబంధించినది. వాస్తవంగా తప్పు అని ప్రభుత్వం తెలిపింది. యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలనే నిర్ణయంపై మంత్రిత్వ శాఖ నిఘా సంస్థలతో చ‌ర్చించింది. బ్లాక్ చేయబడిన ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లు పాకిస్తాన్ సమన్వయంతో కూడిన తప్పుడు సమాచార నెట్‌వర్క్‌కు చెందినవని.. కాశ్మీర్, భారత సైన్యం, రామమందిరం, మైనారిటీ సంఘాలు, సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు భారతదేశానికి సంబంధించిన ఇతర వివిధ సున్నితమైన విషయాలపై వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేసే కంటెంట్‌ను పోస్ట్ చేసేవని మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాకిస్తాన్ కు చెందిన‌.. ది నయా పాకిస్తాన్ గ్రూప్(NPG) యొక్క యూట్యూబ్ ఛాన‌ల్స్‌ నెట్‌వర్క్ మరియు 35 లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్న మరికొన్ని స్వతంత్ర ఛానెల్‌లు ఈ తప్పుడు ప్రచారంలో పాల్గొన్నాయి. ఈ గ్రూప్‌కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను "పాకిస్తానీ న్యూస్ ఛానెల్స్‌ యాంకర్లు" నిర్వహిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల నిరసనలు, పౌరసత్వ (సవరణ) చట్టానికి సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా స‌ద‌రు యూట్యూబ్ ఛానెల్‌లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతపరమైన మైనారిటీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని వ్యాఖ్యానించింది. త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియపై కూడా ఈ యూట్యూబ్ ఛానళ్లు అదే త‌ర‌హా కంటెంట్ పోస్టు చేయొచ్చ‌నే సందేహాన్ని వ్య‌క్తం చేసింది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ.

ఈ మేర‌కు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 16 కింద మంత్రిత్వ శాఖ.. YouTube ఛాన‌ళ్లు మరియు పోర్టల్‌లను బ్లాక్ చేయడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని టెలికాం డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్థించింది. ఈ మేర‌కు కేంద్రం.. ది పంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖాల్సా టీవీ, ది నేకెడ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షన్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్థాన్ గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్, జునైద్ హలీమ్ అధికారి, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అధికారి, మొహ్సిన్ రాజ్‌పుత్, అధికారి, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మియాన్ ఇమ్రాన్, అహ్మద్, నజామ్ ఉల్ హసన్, బజ్వా, న్యూస్24 ఛాన‌ళ్ల‌ను బ్లాక్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.


Next Story