ఛత్తీస్‌ఢ్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. మన భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని వెల్లడించారు. నక్సల్స్ లేని భారతదేశం దిశగా ఇది కీలక అడుగు అని అమిత్ షా ట్వీట్ చేశారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా బార్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకూ 16 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయ తెలిసిందే.