దేశంలో 20 కోట్లు దాటిన క‌రోనా టీకా డోసులు

India Administers Over 20 Crore Vaccine Doses so far.దేశ ప్ర‌జ‌ల‌కు అందించిన క‌రోనా టీకా డోసుల సంఖ్య 20 కోట్లు దాటింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 3:10 AM GMT
vaccine doses

క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. జ‌న‌వ‌రి 16 నుంచి దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌వారం నాటికి దేశ ప్ర‌జ‌ల‌కు అందించిన క‌రోనా టీకా డోసుల సంఖ్య 20 కోట్లు దాటింది. ద‌శ‌ల వారీగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌స్తుతం 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారంద‌రికి వేసేందుకు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 15,69,99,310 మందికి తొలి డోసు.. 4,34,95,681 మందికి రెండో డోసు అందిచిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏ వ‌య‌సు వారికి ఎన్ని డోసులు వేసారంటే..?

- 18 నుంచి 44 ఏళ్ల వ‌య‌సు వారిలో 1,28,74,546 మందికి, 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వారిలో 6,20,47,952 మందికి, 60 ఏళ్ల పైబ‌డిన వారికి 5,71,19,900 మందికి ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌లో 1,51,62,077 మందికి తొలి డోసు వేసిన‌ట్లు తెలిపారు.

- 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సుల‌కు 1, 00, 24, 157 మందికి, 60 ఏళ్లు పైబ‌డిన 1,83,65,811 మందికి, ఆరోగ్య సిబ్బంది - 67,28,443 మందికి, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ 83,77,270 మందికి రెండో డోసు వేసిన‌ట్లు పేర్కొంది.

టీకాల వేగం పెంచాలి..

వ్యాక్సిన్ల పురోగ‌తిపై రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల అధికారుల‌తో కేంద్రం మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా. రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న టీకా నిల్వ‌ల‌తో క‌రోనా టీకా కార్య‌క్ర‌మ వేగాన్ని పెంచేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్రాల‌కు సూచించింది. జూన్ నెల‌ఖారు వ‌ర‌కు అందుబాటులో రానున్న నిల్వ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని చెప్పింది. జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాల వారీగా ప్ర‌ణాళిక‌లు రూపొందించి, దానిని విస్తృతంగా ప్ర‌చారంలోకి తీసుకురావాల‌ని తెలిపింది. రిజిస్ట్రేష‌న్ల‌న్నీ ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గాల్సి ఉన్నందున ఆఫ్‌లైన్‌లో దీనికి అవకాశం క‌ల్పించవ‌ద్ద‌ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు స్ప‌ష్టం చేసింది.

Next Story