ఎన్నికల సమయంలో నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు ఇస్తుంటారు. గెలిచాక అవిచేస్తాం.. ఇవి చేస్తాం అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తారు. దాదాపుగా అన్ని పార్టీలు ఫ్రీ పథకాల పేరుతో హామీలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఓ స్వతంత్ర ఇచ్చిన హామీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరిలా కాకుండా తాను ప్రత్యేకమని అనుకున్నాడో ఏమో.. అతడు ఇచ్చిన హామీలు విన్న ప్రజలు ముక్కన వేలు వేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 6న ఎన్నికలను నిర్వహించబోతున్నారు.
దక్షిణ తమిళనాడులోని మధురై నుంచి శరవరణ్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్నాడు. తనకు ఓటు వేసి గెలిపిస్తే.. నియోజకవర్గంలోని అందరినీ విడతలవారీగా చంద్రమండలానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ఇందుకోసం మధురై సమీపంలో ఓ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. అంతేనా..ఇంట్లో ఆడవారికి వారి పనులకు సాయం చేసేందుకు ప్రతి ఇంటికి ఒక రోబోను కూడా ఇస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన నియోజకవర్గంలోని ఓటర్లు షాక్‌కు గురి కాగా.. దేశ మొత్తం ఆశ్చర్యానికి గురవుతోంది.
శరవణన్ హామీలు..
- గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని విడతల వారీగా చంద్రమండలం పైకి పంపిస్తా..
-నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు..
-ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ..
-ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ..
-ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం..
-నియోజక వర్గ ప్రజలందరికీ ఐఫోన్..