స్వాతంత్య్ర దినోత్సవం రోజు పతాక ఆవిష్కరణ ఉండదు.. ఎందుకో తెలుసా?
స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. ఈ రెండు మనకు అతి ముఖ్యమైన జాతీయ పండుగలు.
By అంజి
స్వాతంత్ర్య దినోత్సవం రోజు పతాక ఆవిష్కరణ ఉండదు.. ఎందుకో తెలుసా?
స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. ఈ రెండు మనకు అతి ముఖ్యమైన జాతీయ పండుగలు. ఈ రోజుల్లో మన జాతీయ జెండా ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడుతుంది. అయితే ఇండిపెండెన్స్ డే రోజు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించరని మీకు తెలుసా? మరేం చేస్తారు? జెండాను ఎగురవేస్తారు. ఆవిష్కరించడానికి, ఎగురవేయడానికి మధ్య తేడా ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు తెలుసుకుందాం..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26న జెండా ఆవిష్కరణ చేస్తారు. అంటే.. ఆ రోజున త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం కొన వద్దే కట్టి ఉంచుతారు. కేవలం తాడు లాగడం ద్వారా జెండా విప్పుకొని రెపరెపలాడుతుంది. కానీ, ఈ రోజు జెండాను స్తంభానికి మధ్ లేదా కింది భాగంలో కట్టరు. కప్పి ఉన్న జెండాను తాడు ద్వారా పైకి లాగే ప్రాసెస్ కూడా జెండా ఆవిష్కరణలో భాగంగా ఉండదు.
ఇలా చేయడాన్ని జెండా ఎగురవేయడం అని అంటారు. దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేస్తారు. అయితే ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినందుకు జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకుంటాం.. జనవరి 26 నాటికి భారతదేశం ఆల్రెడీ స్వేచ్ఛాయుత దేశంగా ఉంటుంది. అందుకే గణతంత్ర దినోత్సవం రోజున జెండాను తక్కువ ఎత్తులో వేలాడదీయరు.