దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగురవేయడం ఇది వరుసగా 12వ సారి.
ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని "ఆశ, ఆకాంక్షల పండుగ"గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా దేశం కొత్త దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరారు.
అంతకుముందు ఆయన.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి, అమరవీరులకు నివాళి అర్పించారు.