దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు..ఆ పార్టీలే టార్గెట్
దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
By Knakam Karthik
దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు..ఆ పార్టీలే టార్గెట్
దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు నిర్వహించింది. దాదాపు 200 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది. ఉనికిలో లేని రాజకీయ పార్టీలకు విరాళాలపై దృష్టి పెట్టింది. పన్ను మినహాయింపులను నకిలీ చేస్తున్న వ్యక్తులు, గ్రూపులను లక్ష్యంగా చేసుకుంది. రాజకీయ విరాళాలు, వైద్య బీమా, ట్యూషన్ ఫీజులు కొన్ని వర్గాల రుణాల వంటి వాటి కోసం నకిలీ క్లెయిమ్‌లను వారు పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, అకౌంటెంట్లు, మధ్యవర్తులు బిల్లులు తయారు చేయడం, నమోదు కాని రాజకీయ పార్టీలను ఉపయోగించి అక్రమ పన్ను మినహాయింపులను పొందుతున్నట్లు నివేదించబడింది.
ఎన్నికల సంఘం వద్ద నమోదులేని రాజకీయ పార్టీల పేరిట వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. కాగా ఆర్ధిక నిబంధనల ఉల్లంఘనపై ఐటీ శాఖ లోతుగా విచారణ చేపడుతోంది. విరాళాల రూపంలో నల్లధనం బదిలీ అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో షెల్ కంపెనీలు, నకిలీ ట్రస్టుల లింకులపై దృష్టి ఐటీ డిపార్ట్‌మెంట్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లోని ఇళ్లు, ఆఫీసులు, అకౌంటింగ్ సెంటర్లలో సోదాలు చేపట్టింది. బ్యాంకు అకౌంట్లు, బిల్లులు, లావాదేవీలపై పూర్తి విశ్లేషణ చేసింది. ఎన్నికల చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించని పార్టీల నమోదు రద్దుపై కూడా చర్చ జరుగుతోంది. ఒకే రోజు – దేశం అంతటా దాడులు కేంద్రం భారీ చర్య చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.