ఆ గ్రామంలో పిల్లల్ని కనడం నిషేధం.. ఎవరైనా గర్భం దాలిస్తే అంతే ఇగా.!
In the village of Sankashyamji in Madhya Pradesh, women are prohibited from bearing children. ఒక్కసారిగా మూఢనమ్మకాలు ప్రబలితే.. అందులోంచి మనుషులను బయటకు తీయడం అసాధ్యంతో కూడుకున్న పని.
By అంజి Published on 13 Nov 2022 12:18 PM ISTఒక్కసారిగా మూఢనమ్మకాలు ప్రబలితే.. అందులోంచి మనుషులను బయటకు తీయడం అసాధ్యంతో కూడుకున్న పని. ఇప్పటికీ భారత్‌లోని చాలా గ్రామాలు మూఢ నమ్మకాల్లో మునిగి తేలుతున్నాయి. అలాంటి ఓ గ్రామమే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉంది. రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ జీ గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ.. ఓ శాపానికి భయపడుతూ జీవిస్తున్నారు. ఎవరైనా తాము పుట్టిన ప్రదేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే వీరు అలా కాదు. తమ గ్రామం పేరు చెప్పుకోవడానికే జడుసుకుంటారు. ఈ గ్రామంలో పిల్లల్ని కనడం పూర్తిగా నిషేధం. ఒక వేళ ఎవరైనా గర్భం దాలిస్తే ఊరి చివరకో.. లేదంటే వేరే గ్రామానికో వెళ్లి కనాల్సి ఉంటుంది.
గ్రామంలో గర్భిణీ ప్రసవం పోసుకుంటే.. సదరు శిశువు మరణిస్తుందని, లేదా అంగవైకల్యంతో ఉంటారని గ్రామ ప్రజలు నమ్ముతారు. ఊరికి శాపం ఉందని, అందుకే గ్రామంలోని మహిళలు ఊరి బయటకు పిల్లల్ని కంటారు. వర్షకాలంలోనైనా సరే.. ఊరి బయట పందిరి వేసుకుని పిల్లలకు జన్మనిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎంతా చెప్పినా అక్కడి గ్రామస్తులు పట్టించుకోరు. సంకశ్యామ్ జీ గ్రామంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చి 400 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికి ఆ ఊరిలో ఒక్క ఆస్పత్రికి లేదు. ఇక బాలింతలకు ప్రభుత్వం నుంచి అందే సహకారాలు కూడా అందవు. గ్రామంలోని మహిళ గర్భం దాలిస్తే.. వెంటనే వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు.
ఒక స్త్రీ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఈ గ్రామంపై శాపం ఏర్పడిందట. 16వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఒక మహిళ గోధుమలు రుబ్బడం ప్రారంభించిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. దీంతో నిర్మాణ పనులు చెదిరిపోయాయని, కోపంతో దేవుళ్లు ఈ గ్రామంలో ఏ ఆడబిడ్డ జన్మనివ్వకూడదని శాపనార్థాలు పెట్టారని నమ్ముతారు. ఈ మూఢనమ్మకాన్ని గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. కొన్ని ప్రమాదవశాత్తు ప్రసవాలు జరిగినప్పుడు, పిల్లవాడు వైకల్యంతో చనిపోయాడని తాము ప్రత్యక్షంగా చూశామని గ్రామస్తులు చెప్పారు. ఈ ఊరిలో ఎవరూ మద్యం సేవించరని, మాంసం తినరని, అది తమ గ్రామానికి దేవుడిచ్చిన వరం అని గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు చెబుతున్నాడు.